సినిమా పేరు: ఎటో వెళ్లిపోయింది మనసు || సంగీత దర్శకుడు : ఇళయరాజా || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : యువన్ శంకర్ రాజు
పల్లవి:
అర్ధమయ్యిందింతే ఇంతేనా..
నేనంటే నీ ఇష్టం ఇంతేనా(3)
నా పైన నీకున్న చూపింతేనా
నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా
నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా ..హో
అర్ధంయ్యిందింతేనా హో హో
దారం నుంచి వేరవుతావా
పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా
నాలో సగమా హో హో హో
చరణం1
చిగురు లేక వలపు రెమ్మ శిశిరమైనదే
చెలియ లేక చెలిమి జన్మ కరుగుతున్నదే
అడుగిక సాగదే నువ్వు జత కానిదే
అలుపిక ఆగదే నీ దారి లేనిదే
పసితనాన నీ పరిచయం పలవరించటం మాననే
పాతికేళ్ళ గురుతులన్ని నన్నే ముంచి ప్రాణం తీస్తున్నా
అర్ధమయ్యిందింతే ఇంతేనా..
నేనంటే నీ ఇష్టం ఇంతేనా