సినిమా పేరు: ఎటో వెళ్లిపోయింది మనసు || సంగీత దర్శకుడు : ఇళయరాజా || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : సునిధి చౌహన్
పల్లవి:
అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం
చరణం1
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సేగాలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం
చరణం2
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితం నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా
నీవని నీదని నేకని అనుకున్నాలే పొరపాటుగా
ఓ నిముషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై
నిశివో శశివో జతవో యతివో …………
నీవేనా నాలో సంగీతం ..
నీవేనా నాలో నిశబ్ధం నిశబ్ధం నిశబ్ధం ..
అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం