సినిమాపేరు : మల్లేశ్వరి || సంగీత దర్శకుడు :కోటి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : చిత్ర,కే కే
పల్లవి:
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు…..
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
చరణం1
అన్నానంటే అన్నానంటావ్
అంతేగాని ఆలోచించవ్
నేనేకదా నీకుండే దిక్కు….
నాకోసం నువు పుట్టానంటావ్…..
నేనంటే పడి చస్తానంటావ్….
నీకెంతంట నాపై హక్కు
ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవెందుకు……
పొమ్మంటూ దురం చేస్తావెందుకూ……
చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు …..
నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు…..
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
చరణం2
దగ్గరకొస్తే భగ్గంటున్నవ్….
పక్కకుపోతే భయపడుతున్నవ్
ఇట్టాగైతే ఎట్టాగేమరి….
ఆపైపంటే ఈ వైపంటావ్…
నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్….
నీతో అన్నీ పేచీలేమరి
ఆ పాదం కందెలాగా పరుగులెందుకే
నీ భారం నాకే ఇవ్వకా….
మాటలో మంత్రం వేస్తూ తియ్యగా….
మైకంలో ముంచేస్తావు మల్ల మల్లగా
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు…..