సినిమా పేరు: శుభ సంకల్పం || సంగీత దర్శకుడు : కీరవాణి || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : చిత్ర ,ఎస్.పీ.బాలు
పల్లవి:
చినుకులన్ని కలిసి చిత్ర కావేరి.. చివరికా కావేరి కడలి దేవేరి..
చినుకులన్ని కలిసి చిత్ర కావేరి.. చివరికా కావేరి కడలి దేవేరి..
కడలిలో వెతకొద్దు కావేరి నీవు.. కడుపులో వెతకొద్దు కన్నీరు కారు..
గుండెలోనే ఉంది గుట్టుగా గంగ.. నీ గంగ..
ఎండమావుల మీద ఎందుకా బెంగ..
రేవుతో నావమ్మకెన్ని ఊగిసలు.. నీవుతో నాకన్ని నీటి ఊయలలు..