సినిమా పేరు: రాజా || సంగీత దర్శకుడు : రాజ్ కుమార్ || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : చిత్ర
పల్లవి:
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నాచూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలె మైమరపూ జ్ఞాపకాలె మేలుకొలుపూ
జ్ఞాపకాలె నిట్టూర్పూ జ్ఞాపకాలె ఓదార్పూ
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
చరణం1
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడూ చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాత జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
చరణం2
గుళ్ళో కథవింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్ళనే దోచే తోట జ్ఞాపకం
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నాచూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకలే మైమరపూ జ్ఞాపకలే మేలుకొలుపూ
జ్ఞాపకలె నిట్టూర్పూ జ్ఞాపకలె ఓదార్పూ
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా