సినిమాపేరు : వాన || సంగీత దర్శకుడు : కమలాకర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : చిత్ర ,కార్తీక్
పల్లవి
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా
చరణం 1
నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
ఔనో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా
చరణం 2
నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందొ నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా
వెంట పడుతుంది చూడు
కనపడని మంట ఏదో
బదులు అడిగింది నేడు
వినపడని విన్నపమేదో
మది మునిగిపోయే మత్తులో
మధురమైన యాతనేదో బైటపడదెలా