సినిమాపేరు : నేను శైలజ || సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కార్తీక్
పల్లవి :
ఎం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను
ఏ ప్రశ్నను ఎవరినేం అడగను
ఓ మౌనమా నిన్నెలా దాటను
చరణం 1
పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే
కన్నీటితో ఈవేళ దాన్నెలా చేరపను
తన జ్ఞాపకమైన తగదని మనసునేలా మార్చను
ఈ ప్రేమకి ఏమిటి వేడుక
ఎ జన్మకి జంటగా ఉండక
ఎం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను
చరణం 2
ఇదివరకలవాటు లేనిది
మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనుక చేయి జారుతుంటే ఎం తోచకున్నది
ఊరించిన నిలిమబ్బుని ఉహించని గాలి తాకిడి
ఎటువైపో తరుముతుంటే కళ్ళారా చూస్తూ ఎల్లా మరి
ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని
తడారుతున్న గుండెలోకి రా రమ్మని
తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఉపిరి
ఈ ప్రేమకి ఏమిటి వేడుకా
ఎ జన్మకి జంటగా ఉండక
ఎం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను
ఏ ప్రశ్నను ఎవరినేం అడగను
ఓ మౌనమా నిన్నెలా దాటను