సినిమా పేరు: ఎటో వెళ్లిపోయింది మనసు || సంగీత దర్శకుడు : ఇళయరాజా || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : కార్తీక్
పల్లవి:
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
హేయ్ హెయ్
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో అన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతెంత
దూరం నన్ను…
పో పో మన్న పో పో మన్న
చరణం1
పొద్దున్నైతే సూర్యుడినై వస్తా
వెచ్చంగ నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా
సందెల్లోన చంద్రున్నై వస్తా
చల్లంగా జోకొట్టేసి స్వప్నాలందిస్తా
మధ్యలో దాహన్నై మధ్య మధ్య మోహన్నై
వెంటే ఉంది వెంటాడుతా
రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే
నీడై జాడై తోడై నీతో వస్తానంటే
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో అన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతెంత
దూరం నన్ను…
పో పో మన్న పో పో మన్న
చరణం2
అద్దం లోన నేనే కనిపిస్తా అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా
చుట్టూ ఉండి నేనే అనిపిస్తా ఆకాశం హద్దుల్లోన నువ్వున్నా అడ్డొస్తా
మబ్బుల్లో మాతేసి వెన్నెల్లో వాతేసి ప్రణాన్ని ముద్దడుతా
ఏ జన్మైనా ఇంతే పైలోకాన ఇంతే
ఆది అంతం అన్ని నేనే అవుతా అంతే
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న