సినిమాపేరు : నిన్నే పెళ్లాడట || సంగీత దర్శకుడు : ఇళయరాజా || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : రాజేష్
పల్లవి:
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా వంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
చరణం1
ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చెందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో
ఎటో వెళ్ళిపోయింది మనసు
చరణం2
కలలన్నవే కొలువుండనీ కనులుండి ఏం లాభమంది
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసు