సినిమాపేరు : కిక్ || సంగీత దర్శకుడు : ఎస్ .ఎస్ .థమన్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు :కార్తీక్ జ్యోత్స్నా
పల్లవి :
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నా ఊపిరి ఆడక నీ వల్లా
ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా
గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
చరణం 1
తెగ ఉరుముతు కలకాలం
తెరమరుగున తన భారం
మోసుకుంటు తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం
ముల్లుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళిపడదా నా సుకుమారం
మెల్లగ మీటితే నాలో మారం పలికుండేదే మమకారం
ఔనా ఐనా నన్నే అంటావే నేరం నాదా
గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
చరణం 2
వెంటపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం
మరిచే మద్యమైనా చెప్పదే సమయం
నీతోనీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామా
ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమా
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా
గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే