0.1 C
New York
Saturday, December 7, 2024
spot_img

Indiramma Inti Peru – Lyrical Song Telugu | Mahatma Movie

రామనామమే తలపంతా..ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత..అపురూపం ఆ చరిత..
ధర్మయోగమే జన్మంతా..ధర్మక్షేత్రమే బతుకంతా..
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత.. ఈ బోసినోటి తాత..
మన లాగే ఓ తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ..
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన సూక్తి..
సత్య అహింసల మార్గ జ్యోతి..నవ శకానికే నాంది..

రఘుపతి రాఘవ రాజారాం..పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నాం..సబ్ కో సన్మతి దే భగవాన్

రఘుపతి రాఘవ రాజారాం..పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నాం..సబ్ కో సన్మతి దే భగవాన్



గుప్పెడు ఉప్పును పోగేసి..నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత..సిసలైన జగజ్జేత
చరక యంత్రం చూపించి..స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగులను బంధించాడురా జాతి పిత..సంకల్ప బలం చేత..
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి..
తూరుపు తెల్లారని నడిరాతిరికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి..
పదవులు కోరని పావన మూర్తి..హృదయాలేలిన చక్రవర్తి..
ఇలాంటి నరుడొకడు ఇలా తలం పై నడయాడిన ఈనాటి సంగతి..
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి..

సర్వజన హితం నా మతం..అంటరానితనాన్ని అంతః కలహాల్ని..
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం..

హే రాం..

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles