సినిమా పేరు: ఎటో వెళ్లిపోయింది మనసు || సంగీత దర్శకుడు : ఇళయరాజా || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : రమ్య
పల్లవి:
ఇంతకాలం కోరుకున్న దారిదేనా ..
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా(2)
చుట్టూ ఏమవుతున్నా అంతా నమ్మాల్సిందేనా
ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
ఈ వింతలింకేన్ని చూడాలో …
చరణం1
నేర్చుకోనా మెల్లగా మరచిపోవటం
మార్చలేనుగా నేనిక మరల ఆ గతం
ఏడు రంగులు వెలిసినా నీ వాన విల్లునా
తీపి నింగిపై విడిచిన తేనె జల్లునా
సాగరానికి కౌగిలివ్వని జీవ నదిలాగ ఇంక ఇంకనా
చరణం2
ప్రాణ బంధం తెంచుకో మూడు ముళ్ళతో
వీడుకోలనే అందుకే మూగ సైగతో
ఒక్క రాతిరే మనకిలా మిగిలి ఉన్నది
తెల్లవారితే చీకటి వెలుగు చేరదు ..
చిన్ననాటికి నిన్న మొన్నకి సెలవని చేతులూపగల్గానా
ఇంతకాలం కోరుకున్న దారిదేనా ..
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా(2)
చుట్టూ ఏమవుతున్నా అంతా నమ్మాల్సిందేనా
ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
ఈ వింతలింకేన్ని చూడాలో …