సినిమాపేరు : నిన్నే పెళ్లాడట || సంగీత దర్శకుడు : ఇళయరాజా || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : చిత్ర , హరిహరని
పల్లవి:
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమేచర
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు
నా భాష ఈ మౌనమే
చరణం1
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం
చరణం2
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకుని నేను తెగ ఎదురుచూసాను నీ తెగువ చూడాలని
చూస్తూనే వేలంత తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం