సినిమా పేరు: తమ్ముడు || సంగీత దర్శకుడు :రమణ జోగుల || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
పల్లవి:
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది.. హోయ్
చరణం1
నమ్మలేని లోకం నుంచి మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా ఉరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి అంతా ఓర్పుగా
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
చరణం2
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్ళీ
కూతురంటి రూపం నీదే నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్ళీ
అందమైన జంటను చూసి మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన జాబిలి
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి