సినిమా పేరు: ఎటో వెళ్లిపోయింది మనసు || సంగీత దర్శకుడు : ఇళయరాజా || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : బేలా శెందే, ఇళయరాజా
పల్లవి:
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా ..
చరణం1
ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికై ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేను కలుపుకో
ఇదేంట చెప్పలేని ఈ భావనే పేరునుందో
తెలియదు దానికైనా ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకేన్ని ఎన్నో
అవన్నీ బయటపడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
చరణం2
మాటిమాటికీ మొదలాయే అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటిపూల తావీదు తాకిందిలాగ
గులాబీ లాంటి గుండె మోసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేల హో
ఎలాగా ఏమనాలి ఈ లీల
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా