సినిమాపేరు : శుభాకాంక్షలు || సంగీత దర్శకుడు : కోటి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు :కే.ఎస్. చిత్ర ,ఎస్ .పి.బాలసుబ్రమణ్యం
పల్లవి :
మనసా పలకవే మధుమాసవు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మనసా పలకవే మధుమాసవు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచుతెరెలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా
ఓ ఓ ఓ ఆ ఆ ఆ
తుమ్మెద తుమ్మెద విన్నావమ్మా
నిన్ను జుమ్మంటూ రమ్మందే రంగేళి పూల కొమ్మ
మనసా పలకవే మధుమాసవు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
చరణం 1
నాలో కులుకుల కునుకును రేపి
లో లో తెలియని తలపులు రేపి
పిలిచే వలపుల వెలుగును చూపి
లాగే రాగమిది
నీలో మమతల మధువుని చూసి
నాలో తరగని తహ తహ ధుకి
నీకే గలగలా పరుగులు తీసి
చేరే వేగమిది
ఆరారు కాలాల వర్ణాలతో
నీరాజనం నీకు అందించన
ఏడేడు జన్మల బంధాలతో
ఈ నాడు నీ ఈడు పండించన
మరి తయారయే ఉన్న వయ్యారంగా
సయ్యంటూ ఒళ్ళోకి వాలంగా
దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా
చిన్నారి వన్నెలి ఎలంగా
ప్రతిక్షణం పరవశం కలుగగా
మనసా పలకవే మధుమాసవు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
చరణం 2
ఆడే మెరుపులా మెలికలు జానా
పాడే జిలిబిలి పలుకుల మైన
రాలె తొలకరి చినుకులలోన
తుళ్ళే తిల్లాన
వేగే పాదముల తపనలపైనా
వాలే చిరు చిరు చెమటల వానా
మీటే చిలిపిగా నరముల వీణ
తియ్యని తాళ్ళానా
బంగారు శృంగార భావాలతో
పొంగారు ప్రాయాన్ని కీర్తించన
అందాల మందిరాహోరాలతో
నీ గుండె రాజ్యాన్ని పాలించన
ఇక వెయ్యేళ్ళయినా నిన్ను విడిపోనంటు
ముమ్మారు ముద్దాడి ఒట్టేయన
నువ్వు వెళ్లాలన్న ఇంకా వీలేదుఅంటూ
స్నేహాల సంకెళ్లు కట్టేయన
కాలమే కదలక నిలువగా
ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసవు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచుతెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా
ఓ ఓ ఓ ఆ ఆ ఆ