సినిమాపేరు : వీ || సంగీత దర్శకుడు : ఎస్.ఎస్. థమన్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : సాషా తిరుపతి ,అమిత్ త్రివేది
పల్లవి :
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీలా
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించేయ్యి నన్నల్లి
కిలాడి కోమలి గులెబా కావలి
సుఖాల జావళి వినాలి కౌగిలి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీలా
చరణం 1
ఓ అడుగులో అడుగువై ఇలా రా నాతో
నిత్యం వరాననా
హా బతుకులో బతుకునై నివేదిస్తా
నా సర్వం జహాపనా
పూల నావ గాలితోవ
హైలో హైలీసూ
చేరనీవా చేయనీవా
సేవలేవేవోఓ
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీలా
చరణం 2
మనసులో అలాలయే రహస్యాలేవో చెప్పే
క్షణం ఇది
మనువుతో మొదలాయె మరో జన్మాన్నాయి
పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని
చూసి పోల్చుకో
నాలో పెంచ నీ కలలన్ని
ఊగని ఊయళ్లు
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీలా
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించేయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులెబా కావలి
సుఖాల జావళి వినాలి కౌగిలీయి