సినిమాపేరు : క్లాస్మేట్స్ || సంగీత దర్శకుడు : ఆలిస్ పాల్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు :మల్లికార్జున్ ,అంజనా సౌమ్య
పల్లవి:
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరిచేరవెందుకు
ఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు
చరణం1
అంత బిగువా మెట్టుదిగవా ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
ఇంత తెగువా మాటవినవా కొంత కష్టమైనా కాస్త ఆగవా
మది నాకు చెప్పకుండ నీ వెంట పడ్డది
మన చేతిలోన ఉంద ఈ ప్రేమ పద్ధతి
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
నందకిషోరా నవనీతచోరా నవమన్మదాధారా రారా నన్నేలుకోవేరా
చెయ్యందుకోరా శృంగారశూరా చేరంగరావేరా కృష్ణా చెట్టెక్కిదిగవేరా
చరణం2
రెచ్చగొట్టినా నవ్వుతున్నదే మత్తు కమ్మేసిందా కన్నెమనసుని
ఎంత కుట్టినా కెవ్వుమనదే పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
నిను చూడకుంటె ప్రాణం ఇక నిలువనన్నది
పదునైన పూలబాణం నను తాకుతున్నది
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరిచేరవెందుకు
ఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు