సినిమాపేరు : రెడ్ || సంగీత దర్శకుడు : మని శర్మ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : దింకర్,నూతన
పల్లవి :
మౌనంగా ఉన్నా నీతో అంటున్నా
నా వెంట నిన్ను రారమ్మని
తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా కదపొద్దంటున్నా లేలెమ్మనీ
వినలేదా కాస్తయినా నీ ఎదసడిలోనే లేనా
వెతకాల ఏమైనా నిను నాలోనే చూస్తున్నా
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచనా
చరణం 1
నాలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతియ్యని ఊహకు ఒడిలో ఊయల వేసి
నీ పేరుతో కొత్తగా పుట్టనీ నా జీవితం ఇప్పుడే మొదలనీ
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
చరణం 2
ఎవరూ మన జాడని చూడని చోటే కనిపెడదామా
ఎపుడూ మనమిద్దరి ఒక్కరిలాగే కనబడుదామా
నా పెదవిలో నవ్వులా చేరిపో
నా ఊపిరే నువ్వులా మారిపో
ఒకటే బ్రతుకు మన ఇద్దరికి ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన