సినిమాపేరు : అతడు || సంగీత దర్శకుడు : మని శర్మ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : ఎస్ .పి.బాలసుబ్రమణ్యం, కే.స్.చిత్ర
పల్లవి :
నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే
అంత సరదా తెలుసునా
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
నా కన్నుల నిధే వెన్నెల ఓ ఓ ఓ
నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే
అంత సరదా తెలుసునా
చరణం 1
ఇంకొంచం అనుకున్న ఇకచాల్లే అన్నానా
వదలమంటే ఏమిటర్ధం
వదిలి పొమ్మన
పనిమాల పైపైన పడతావేం పసికూన
ముద్దు మీరుతున్న పంతం
హద్దులోనే ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికి
మొగలి మొనలు తగిలేనా
లేత సోయగానికి కూత దేనికి
చరణం 2
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన
ఒదిగున్న ఒరలోన
కదిలించకె కుర్రదానా
కత్తి సాముతో ప్రమాదం పట్టు జారేనా
పెదవోపని పదునైన పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం
నీకు నేను నేర్పన
సొంత సొగసు బరువేన సుకుమారికి
అంత బిరుసు పరువేన
రాకుమారుడాన్టి నీ రాజసానికి
నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే
అంత సరదా తెలుసునా
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన