సినిమాపేరు : కొత్త బంగారులోకం || సంగీత దర్శకుడు : మిక్కి జే మేయర్ ||గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి||పాడిన వారు : శ్వేతా పండిట్
పల్లవి:
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినావినరా ఒకరైనా
నేనునీ నీడని నువ్వునా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్పవెనకాలాస్వప్నం ఇప్పుడెదురయ్యేసత్యం తెలిస్తే
తట్టుకోగలదావేగం కొత్త బంగారులోకం పిలిస్తే
చరణం1
మొదటిసారి మదినిచేరి నిదరలేపిన హృదయమా
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరికొత్తగా మరోపుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా
నేనునీ నీడని నువ్వునా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్పవెనకాలాస్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
తట్టుకోగలదావేగం కొత్త బంగారులోకం పిలిస్తే
చరణం2
పదమునాది పరుగునీదీ రిధమువేరా ప్రియతమా
తగువునాది తెగువనీది గెలుచుకోపురుషోత్తమా
నువ్వేదారిగా నేనేచేరగా ఎటుచూడకా వెనువెంటేరానా
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా
నేనునీ నీడని నువ్వునా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్పవెనకాలాస్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
తట్టుకోగలదావేగం కొత్త బంగారులోకం పిలిస్తే