పాట : ఏచోట ఉన్నా నీ వెంటలేనా / రచయిత : సిరివెన్నెల సీతా రామ శాస్త్రి / సినిమా : నువ్వే నువ్వే
పాడినవారు : చిత్ర; సంగీతం : కోటి; దర్శకత్వం : త్రివిక్రమ్
పల్లవి:
ఏచోట ఉన్నా నీ వెంటలేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
ఏచోట ఉన్నా నీ వెంటలేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
చరణం:
నేల వైపు చూసీ నేరం చేశావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ బంధిస్తుందా మల్లెపూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవా
క్షణమై కరిగే కలవా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
చరణం:
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరేవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటేలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
ఏచోట ఉన్నా నీ వెంటలేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే