సినిమా పేరు: యాత్ర || సంగీత దర్శకుడు : కృష్ణ కుమార్ || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు :ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
పల్లవి:
పల్లెల్లో కళ ఉంది
పంటల్లో కలిముంది
అని చెప్పే మాటల్లో
విలువేముంది.
కళ్ళల్లో నీరుంది
ఒళ్ళంతా చమటుంది
ఆ చెమ్మకి చిగురించే
పొలమేముంది
చినుకివ్వని మబ్బుందీ
మొలకివ్వని మన్నుంది
కరుణించని కరువుంది
ఇంకేముంది
రైతేగా రాజంటు
అనగానే ఏమైందీ
అది ఏదో నిందల్లే
వినబడుతోంది
చరణం1
అనుదినం ప్రతిక్షణం
బదులేమివ్వని
ప్రశ్నగా మారెనే
కొడవలి
పైరుకా పురుగుకా
ఎవరికి మేలని
తెలుసునా విషమాయె
మందుకిి
పల్లెల్లో కళ ఉంది
పంటల్లో కలిముంది
అని చెప్పే మాటల్లో
విలువేముంది.
కళ్ళల్లో నీరుంది
ఒళ్ళంతా చమటుంది
ఆ చెమ్మకి చిగురించే
పొలమేముంది
చరణం2
వరివెన్నే విరిసెనా
గ్రామసీమ వాడితే
మన వెన్నే నిలిచేనా
రైతుపేగు మాడితే
నమ్ముకున్న నేలతల్లి
నెర్రలుగా చీలితే
అమ్ముకున్న జీవలాన్ని
కబేళాకి చేరితే
ఏ చెవికి వినబడవేం
పల్లె తల్లి గోశాలు
ఎవ్వరికీ కనపడవేం
చిల్లు పడిన ఆశలు
పల్లెల్లో కళ ఉంది
పంటల్లో కలిముంది
అని చెప్పే మాటల్లో
విలువేముంది.
కళ్ళల్లో నీరుంది
ఒళ్ళంతా చమటుంది
ఆ చెమ్మకి చిగురించే
పొలమేముంది
చినుకివ్వని మబ్బుందీ
మొలకివ్వని మన్నుంది
కరుణించని కరువుంది
ఇంకేముంది
పల్లెల్లో కళ ఉంది
పంటల్లో కలిముంది
అని చెప్పే మాటల్లో
విలువేముంది.
కళ్ళల్లో నీరుంది
ఒళ్ళంతా చమటుంది
ఆ చెమ్మకి చిగురించే
పొలమేముంది