సినిమాపేరు : కలుసుకోవాలని || సంగీత దర్శకుడు :దేవి శ్రీ ప్రసాద్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : సుమంగళి ,వేణు
పల్లవి :
ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది
చరణం1
కన్నీళ్ళలో ఎలా ఈదను
నువే చెప్పు ఎదురవని నా తీరమా
నిట్టూర్పుతో ఎలా వేగను
నిజం కాని నా స్వప్నమా హా
ఎలా దాటాలి ఈ ఎడారిని
ఎలా చేరాలి నా ఉగాదిని
క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా
ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
చరణం2
ఒకే ఒక క్షణం చాలుగా
ప్రతి కల నిజం చేయగా
యుగాలు కలకాలమా ఇలాగే నూఆగుమా
దయుంచి ఆ దూరమా ఇవాళ ఇటు రాకుమా
ఇదే క్షణం శిలాక్షరం అయ్యేట్టు దీవించుమా
ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది