సినిమా పేరు: యాత్ర || సంగీత దర్శకుడు : కృష్ణ కుమార్ || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : శ్రీనివాస్
పల్లవి:
మరుగైనావ రాజన్నా.. కనుమరుగైనావా రాజన్నా
మా ఇంటి దేవుడవే.. మా కంటి వెలుగువే
ఒరిగినావ రాజన్నా.. ఒరిగినావ రాజన్నా
అద్దుమానం అడవిలోనా.. ఏలకాని ఏడకాడ
పైన పోయే పచ్చులారా.. ఏడమ్మా మన రాజన్నా
చరణం1
నువ్వొచ్చే దావల్లో.. పున్నాగా పూలుజల్లి
నీకోసం వేచుంటే.. చేజారీపోతీవా
చల్లానీ నీ నవ్వూ.. చక్కానీ నీ నడక
రచ్చబండా చేరకనే.. నేలరాలిపోతీవా
చరణం2
మాటతప్పని రాజన్నా.. మడమతిప్పని మనిషివయా
మరవజాలము నీ రూపం.. నీకు సాటి ఎవరయ్యా
మా గుండెల్లో గుడిసెల్లో.. కొలువుంటావు రాజన్నా
సాయం సంధ్యా దీపంలో.. నిన్నే తలుచూకుంటాము
నిన్నే తలుచుకుంటాము..
మరుగైనావ రాజన్నా.. కనుమరుగైనావా రాజన్నా
మా ఇంటి దేవుడవే.. మా కంటి వెలుగువే
ఒరిగినావ రాజన్నా.. ఒరిగినావ రాజన్నా