సినిమా పేరు: యాత్ర || సంగీత దర్శకుడు : కృష్ణ కుమార్ || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : కల భైరవ
పల్లవి:
నీ కనులలో కొలిమై రగిలే కలేదో
నిజమై తెలవారనీ
వెతికి వెలుగై రానీ
చరణం1
ఈనాటి ఈ సుప్రభాత గీతం
నీకిదే అన్నది స్వాగతం
ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం
చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం
ఎక్కడో పైన లేదు యుధ్ధమన్నది
అంతరంగమే కదనరంగమన్నది
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించి రారా రాజశేఖరా అంటున్న నీ మనసులో మండుటెండలాగా
నిప్పులే చెరగని నిశ్చయం
నీ గుండెలో మంచు కొండలాగ
నిత్యమూ నిలవనీ నమ్మకం
వసుధకే వందనం చెయ్యకుండా
నింగి పైకి ఎగురుతుందా గెలుపు జెండా
ఆశయం నెత్తురై పొంగకుండా
శ్వాసలోని సమర శంఖమాగుతుందా
చరణం2
ఈనాటి ఈ సుప్రభాత గీతం
నీకిదే అన్నది స్వాగతం
ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం
చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం
ఎక్కడో పైన లేదు యుధ్ధమన్నది
అంతరంగమే కదనరంగమన్నది
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించి రారా రాజశేఖరా అంటున్న నీ మనసులో మండుటెండలాగా
నిప్పులే చెరగని నిశ్చయం
నీ గుండెలో మంచు కొండలాగ
నిత్యమూ నిలవనీ నమ్మకం
వసుధకే వందనం చెయ్యకుండా
నింగి పైకి ఎగురుతుందా గెలుపు జెండా
ఆశయం నెత్తురై పొంగకుండా
శ్వాసలోని సమర శంఖమాగుతుందా
నీ కనులలో కొలిమై రగిలే కలేదో
నిజమై తెలవారనీ
వెతికి వెలుగై రానీ