సినిమాపేరు : వాన || సంగీత దర్శకుడు : కమలాకర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : చిత్ర ,రంజిత్
పల్లవి:
సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి
వడగళ్ళ వాన ఉరిమింది ఐనా వినిపించదే జంటకి
తడిసే తరుణాన గొడుగై నే లేనా
చరణం 1
వల అనుకోనా వలపనుకోనా కలిపిన ఈ బంధం
వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నే సొంతం
చినుకై వచ్చావే వరదై ముంచావే
చరణం 2
చిలిపిగ ఆడి చెలిమికి ఓడి గెలిచా నీపైన
తగువుకు చేరి తలపుగ మారి నిలిచా నీలోన
మనసే ఈ వింత మునుపే చూసిందా
సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి
వడగళ్ళ వాన ఉరిమింది ఐనా వినిపించదే జంటకి
తడిసే తరుణాన గొడుగై నే లేనా