సినిమాపేరు : గౌతమ్ ఎస్ ఎస్ సి || సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : రంజిత్
పల్లవి:
తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుదనం పదునుగుణం తెలిసినవాడు
ఇక తనను తనే ఎదురుకునే పొగరౌతాడు
చరణం1
థదిగిణతోం అని చిలిపి చిటిక వేద్దాం
కథకళితో మన పదము కదిపి చూద్దాం
తికమకతో బడి చదువు బరువు మోద్దాం
పగపగతో శృతి కలిపి సులువు చేద్దాం
దారే గోదారైతే దాన్నే ఈదాలంతే
ఉరుము సడే ఉలికిపడే చినుకు స్వరాలం
పీడకలే వేడుకలా మార్చుకోగలం
చరణం2
పరిగెడితే ఎటు అనదు పడుచు ప్రాయం
పనిపడితే మన మనసె మనకు సాయం
పడగొడితే కనబడని పిరికి సమయం
వెలుగవదా తను చేసిన ప్రతి గాయం
కయ్యం కోరిందంటే కాలం ఓడాలంతే
ప్రతి విజయం వదలి మరో ముందడుగేద్దాం
వెనకతరం చదువుకునే కథ మనమౌదాం
తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుదనం పదునుగుణం తెలిసినవాడు
ఇక తనను తనే ఎదురుకునే పొగరౌతాడు