సినిమాపేరు : సొంతం || సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు :చిత్ర
పల్లవి:
తెలుసునా తెలుసునా మనసుకే తొలి కలయిక
అడగనా అడగనా అతడిని మెల్ల మెల్లగా
నమ్ముతాడో నమ్మడొ అని తేల్చుకోలేకా
నవ్వుతాడో ఎమిటో అని బయటపడలేకా
ఎలా ఎలా దాచి ఉ౦చేది ఎలా ఎలా దాన్ని ఆపేది
చరణం1
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతో౦ది
పెదవి చివరే పలకరి౦పు నిలిచిపోతో౦ది
కొత్త నేస్త౦ కాదుగా ఇ౦త క౦గారె౦దుకో
ఇ౦త వరకు లేదుగా ఇపుడు ఏమై౦దో
కని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా…
చరణం2
గు౦డె లోతుల్లో ఏదో బరువు పెరిగి౦ది
తడిమి చూస్తే అతని తలపే ని౦డిపోయు౦ది
నిన్న దాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గు౦డెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హ్రుదయమా అనుమతైనా అడగలేదని
తెలుసునా తెలుసునా..
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా