3.8 C
New York
Thursday, February 13, 2025
spot_img

మాదిగ రిజర్వేషన్ల అమలు కోసం – టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు

మాదిగ రిజర్వేషన్ల అమలు కోసం అమరులైనవారికి తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నివాళులర్పించింది. వారి కుటుంబాలకు టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు ఉడతా భక్తిగా సాయం చేసి వారికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీ-ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, అమరవీరుల బంధువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకు వాతావరణం అనుకూలిస్తున్నదని, సుప్రీంకోర్టు ఈమధ్య రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చని చెప్పడం శుభ పరిణామమని ఇటుక రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించి డ్రాప్టింగ్ కమిటికి ఇచ్చిన రోజున తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఐదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టులో ఐదుగురితో కూడిన దర్మాసనం.. వర్గీకరణ ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చన్న సూచనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 29 రాష్ట్రాల్లో ఎస్సీల్లో 108 కులాలు ఉన్నాయని కొన్ని కులాలకు రిజర్వేషన్లు అందడం లేదని, వర్గీకరణ జరిగితే కింది కులాలకు కూడా ఫలాలు అందుతాయని రాజు ఆకాంక్షించారు. 

జనాభా నిష్పత్తి ప్రకారం కులాలకు రిజర్వేషన్ల పంపిణీ జరగాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సూచించారని, జనాభా ప్రతిపాదికన ఎబిసిడి వర్గీకరణ జరుగాలని కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీలలో తీర్మానం చేసి పార్లమెంట్కు పంపడం జరిగిందని, అయితే అంతటితో ఆగకుండా ప్రధానమంత్రిని కలసి పార్లమెంట్ లోబిల్లు పెట్టేవరకూ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో చట్టం చేసే వరకూ మాదిగలంతా ఏకతాటిపై ఉండి పోరాడాలని ఇటుక రాజు పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోతి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి చేయలేదని, సుప్రిం కోర్టు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించి పార్లమెంటే.. రాష్ట్రాలు చట్టాలు చేసుకునేలా చేస్తే సంతోషిస్తామన్నారు. ఏ ప్రభుత్వమైనా మాదిగ, మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్టి పెట్టాలని కోరారు.  మాదిగలపై జరుగుతున్నా దాడులను అరికట్టే విధంగా చట్టాలు తేవాలని, దాడులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 12 శాతం ఉన్న మాదిగలకు కేసిఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని, మాదిగలు ఓట్లు వేయడానికే పనికి వస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles