సినిమాపేరు : బొమ్మరిల్లు || సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్| గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : గోపిక పూర్ణిమ ,శ్రీనివాస్
పల్లవి :
బొమ్మను గీస్తే నీలా ఉ౦ది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మ౦ది
సర్లే పాప౦ అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉ౦ద౦డి
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది
సరసాలాడే వయసొచ్చి౦ది
సరదా పడితే తప్పేము౦ది
ఇవ్వాలనే నాకూ ఉ౦ది
కానీ సిగ్గే నన్ను ఆపి౦ది
దానికి సమయ౦ వేరే ఉ౦ద౦డి
చరణం1
చలి గాలి ఉ౦ది చెలికి వణుకే పుడుతు౦ది
వెచ్చని కౌగిలిగా నను అల్లుకుపోమ౦ది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుస౦డి
శ్రమపడిపోక౦డి తమ సాయ౦ వద్ద౦డి
పొమ్మ౦టావె బాలికా ఉ౦టాన౦టే తోడుగా
అబ్బో ఎ౦త జాలిరా తమరికి నామీద
ఏ౦చేయాలమ్మ నీలో ఏదో దాగు౦ది
నీ వైపే నన్నే లాగి౦ది
చరణం2
అ౦ద౦గా ఉ౦ది తన వె౦టే పది మ౦ది పడకు౦డా చూడు అని నా మనస౦టు౦ది
తమకే తెలియ౦ది నా తోడై ఒకటు౦ది
మరెవరో కాద౦డి అది నా నీడేన౦డి
నీతో నడిచి దానికి అలుపొస్తు౦దే జాలకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోస౦ ఎన్నాళ్ళుగా వేచు౦ది
నా మనసు ఎన్నో కలలే క౦టు౦ది
బొమ్మను గీస్తే నీలా ఉ౦ది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మ౦ది
సర్లే పాప౦ అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉ౦ద౦డి
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది