సినిమాపేరు : ఎలా చెప్పను || సంగీత దర్శకుడు :కోటి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కే.ఎస్. చిత్ర
పల్లవి :
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో ఓ ఓ
తెలియని దారులలో ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
చరణం 1
ఎన్ని వేల నిమిషాలో
లెక్క పెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో
చెప్పవేమి అంటోంది
నిన్ననేగ వెళ్లావన్న సంగతి
గుర్తేలేని గుండె ఇది
ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆ ఆఆ
మళ్ళీ నిన్ను చూసేదాక
నాలో నన్ను ఉండనీక
ఆరాటంగా కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
చరణం 2
రెప్ప వెయ్యనంటోంది
ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే
కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే
మళ్ళీ మళ్ళీ తలచుకుని
ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆ ఆఆ
ఇంకా ఎన్నో వున్నాయంటూ
ఇప్పుడే చెప్పాలంటూ
నిద్దరోను అంటోంది
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో ఓ ఓ
తెలియని దారులలో ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా