సినిమాపేరు : ఫిదా || సంగీత దర్శకుడు :శాఖ్త్కాంత్ కార్తీక్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : అరవింద్ శ్రీనివాస్,రేణుక
పల్లవి:
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
ఐనా మనసు దాన్ని పోల్చలేకున్నది
తానే వెతుకుతోంది దొరికినట్టే ఉన్నది
ఐనా చెయ్యి చాచి అందుకోకున్నది
రమ్మంటున్నా.. పొమ్మంటున్నా..
వస్తూ ఉన్నా.. వచ్చేస్తున్నా..
ఏదో జరుగుతోంది యెదలో అలజడి
ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
ఏదో జరుగుతోంది యెదలో అలజడి
ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
చరణం1
గుండెలో ఇదేమిటో కొండంత ఈ భారం
ఉండనీడు ఊరికే ఏ చోట ఏ నిమిషం
వింటున్నావా.. నా మౌనాన్ని
ఏమో ఏమో.. చెబుతూ ఉంది
ఏదో జరుగుతోంది యెదలో అలజడి
ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
ఏదో జరుగుతోంది యెదలో అలజడి
ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
చరణం2
కరిగిపోతూ ఉన్నది
ఇన్నాళ్ళ ఈ దూరం
కదిలిపోను అన్నది
కలలాంటి ఈ సత్యం
నా లోకంలో.. నా లోకంలో
అన్ని ఉన్నా.. అన్ని ఉన్నా
ఏదో లోపం నువ్వేనేమో
ఆ పై దూరం.. ఏం లేకున్నా..
సందేహంలో.. ఉన్నానేమో
ఏదో జరుగుతోంది యెదలో అలజడి
ఏదో అడుగుతోంది యెదరే నిలబడి
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
ఐనా మనసు దాన్ని పోల్చలేకున్నది
ఏదో జరుగుతోంది యెదలో అలజడి
ఏదో అడుగుతోంది యెదరే నిలబడి