సినిమా : నువ్వొస్తానంటే నేనొద్దంటానా || సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ || రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడినవారు : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం
పల్లవి :
ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్
చరణం :
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలి పిలుపేదంటే
ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్
చరణం :
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరి చేరే ప్రియురాలే గెలుపంటే
తాను కొలువై వుండే విలువే ఉంటే అలాంటి మనసుకి తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకలో తడబడిన నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో ఎర్ర బడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వేతికే సంక్రాంతై ఎదురవదా
ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలం గాలం ఘల్ ఘల్