సినిమాపేరు : నీ స్నేహం || సంగీత దర్శకుడు : ఆర్ .పి పట్నాయక్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : రాజేష్,ఉష
పల్లవి :
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం
ఓ హనీ ఐ లవ్ యు ఓ హనీ ఐ నీడ్ యు
చరణం 1
నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ
ఒప్పుకొలేవో ఏమో మురిసే మనసా
రెప్పనే దాటి రాదే కలలో ఆశ
పొద్దే రాని నిద్దర్లోనే ఉండి పోనీ నిన్నే చూసే కలకోసం
సర్లే కాని చీకట్లోనే చేరుకోనీ నువ్వు కోరే అవకాశం
తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం
చరణం 2
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
వానలా తాకగానే ఉరిమే మేఘం
వీణలా మోగుతుంది ఎదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం
వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం
ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజ యోగం దక్కినంత ఆనందం
అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమరోగం తగ్గదేమో ఏ మాత్రం
తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం