సినిమాపేరు : కంచె || సంగీత దర్శకుడు :చిఱన్తాన్ భట్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : శ్రేయ గోషాల్
పల్లవి
నిజమేనని నమ్మనీ
అవునా అనే మనసు ని
మనకోసమే లోకమని
నిజమేనని నమ్మనీ
చరణం1
కనుపాప లోని ఈ కలల కాంతి
కరిగేది కానే కాదనీ
గత జన్మలన్నీ
మరు జన్మలన్నీ
ఈ జన్మ గానే మారనీ
ఈ జంట లోనే చూడనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ
చరణం2
కాలం అనేదే లేని చోట
విజయాల పేరే వినని చోట
మనం పెంచుదాం
ఏకమై..ప్రేమగా..ప్రేమనీ..
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ