సినిమా పేరు: ఎటో వెళ్లిపోయింది మనసు || సంగీత దర్శకుడు : ఇళయరాజా || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : రమ్య,షాన్
పల్లవి:
ఏది ఏది కుదురేది ఏది …
ఏది ఏది కుదురేది ఏది యెదలో …..
ఏది ఏది కుదురేది ఏది యెదలో …
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేది నీడై ఉందే ..
చరణం1
నే ఓడె ఆట నీవాడమంట ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంట చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస
ఊహ ఊసు నీతో నేనందిస్తా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళయి చూస్తూ ఉంటే
చరణం2
నా కాలం నీదే నువ్వై గడిపేసేయ్ ఎన్నాళ్లవుతున్నా
ఓహో నీ పాఠం నేనే నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా
నా లోకం నిండా నీ నవ్వే..నాలోనూ నిండా నువ్వే
తీరం దారి దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే
మనలో నువ్వు,నేను ఉంటే
ఏది ఏది కుదురేది ఏది …
ఏది ఏది కుదురేది ఏది యెదలో …..
ఏది ఏది కుదురేది ఏది యెదలో …
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేది నీడై ఉందే ..