సినిమాపేరు : క్షణక్షణం || సంగీత దర్శకుడు : కీరవాణి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,చిత్ర
పల్లవి:
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గే లేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ అగ్గల్లె వస్తే ఆపేదెట్టా హద్దు పద్దు వద్దా
చరణం1
మోజు లేదనకు ఉందనుకో ఇద్దరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకు చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
చూడదా సహించని వెన్నెల దహించిన కన్నుల
కళ్ళు మూసేసుకో హాయిగా
చరణం2
పారిపోను కదా అది సరే అసలు కధ అవ్వాలి కదా
ఏది ఆ సరదా అన్నిటికీ సిద్దపడే వచ్చాను కదా
అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు…