సినిమాపేరు :ఆపద్బాంధవుడు|| సంగీత దర్శకుడు : ఎం .ఎం .కీరవాణి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : ఎస్ .పి.బాలసుబ్రమణ్యం
పల్లవి:
అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు జాడలేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యేడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల
చరణం1
ఔరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీలా
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
చరణం2
నల్లరాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణజానపదాలతో ఙానగీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
ఆలమందకాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాల
తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా