సినిమాపేరు : నీ స్నేహం || సంగీత దర్శకుడు : పట్నాయక్ ,ప్రభు దేవా | గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : రాజేష్ ,ఉష
పల్లవి :
ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో
ఏంచేసిందో ఆ చిన్నదీ ప్రేమించేసానందీమది
తన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చరణం1
ఒక్కటే ఙాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంట పడకుంటే తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి
చరణం2
ఆమెనే వెతకటం అందుకే బ్రతకటం కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా కలవరమా ఆమెతో ఈ అలజడి
ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో
ఏంచేసిందో ఆ చిన్నదీ ప్రేమించేసానందీమది
తన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి