సినిమాపేరు : రాజు భాయ్ || సంగీత దర్శకుడు : యువన్ శంకర్ రాజా | గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : హరీష్ రాఘవేంద్ర
పల్లవి :
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు
చరణం1
ఎటు చూసినా ఏంచేసినా ఏదారిలో అడుగేసినా
నలువైపులా నా ఎదురే ఉందామైనా ఆమైనా
ఏ మబ్బులో దోగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతోందిగా
చరణం2
చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బ్రతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు