సినిమాపేరు : బొంబాయి ప్రియుడు || సంగీత దర్శకుడు : కీరవాణి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : ఎస్.పీ.బాలు,చిత్ర
పల్లవి:
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..

చరణం1
కిలకిలా కులికితే ఒంటి పేరే సుందరం కంటి ముందే నందనం
చిలకలా పలికితే ఉండిపోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి నన్నే కోరే పరిచయం
పున్నాగపూలు పూసే వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో ముందులేదీ కలవరం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
చరణం2
వలపులా వాలితే కన్నెపైటే స్వాగతం కన్న కలలే అంకితం
చెలిమిలా చేరితే పల్లెసీమే పావురం పిల్లప్రేమే వాయనం
సింధూరపూల వాన నిన్నూ నన్ను తడపనీ
అందాల కోనలోన హాయి రేయి గడపనీ
కొత్తగున్నా మత్తుగుంది మన జగం