సినిమాపేరు : హరే రామ్ || సంగీత దర్శకుడు : మీకీ జె మేయర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కార్తీక్
పల్లవి:
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగ
జోలలో జారిపో మేలుకోలేనంతగ
ఆపదేం రాదే నీ దాక నేనున్నాగ
కాపలా కాస్తూ ఉంటాగ
పాపలా నిదరో చాలింక
వేకువగా దీపమై చూస్తూ ఉంటాగ
కానీ అనుకోనీ అలివేణి
ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని
కానీ అనుకోనీ అలివేణి
ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకోలేనంతగా
చరణం 1
ఊరికే ఉసూరుమంటావే
ఊహకే ఉలిక్కిపడతావే
చక్కగా సలహాలిస్తావే
తిక్కగా తికమకపెడతావే
రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా
రేయంతా వెలిగించే రంగుల లోకాన్నే
కానీ అనుకోనీ అలివేణి
ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని
కానీ అనుకోనీ అలివేణి
ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకోలేనంతగా
చరణం 2
ఎదురుగా పులి కనపడుతుంటే
కుదురుగా నిలబడమంటావే
బెదురుగా బరువెక్కిందంటే
మది ఇలా భ్రమపడుతున్నట్టే
గుప్పెడు గుండెల్లొ నేనే నిండుంటే
కాలైనా పెట్టవుగా సందేహాలేవే
ఆపదేం రాదే నీదాక నేనున్నా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువదాక
దీపమై చూస్తూ ఉంటాగా
కానీ అనుకోనీ అలివేణి
ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని
కానీ అనుకోనీ అలివేణి
ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకోలేనంతగా