సినిమాపేరు : అష్ట చమ్మ || సంగీత దర్శకుడు : కళ్యాణి మాలిక్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : శ్రీ రామ చంద్ర ,మానస
పల్లవి:
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం మూగింది ఎదలో
నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో
చూస్తూనే ఉన్నా.. ఔనా అంటున్నా..
అయ్ బాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా

ను ను ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే

చరణం1
పరవాలేదు పరువేమి పోదే పరదాలోనే పడి ఉండరాదే
పరుడేమి కాదు వరసైన వాడే బిడియం దేనికే హృదయమా
చొరవే చేస్తే పొరపాటు కాదే వెనకడుగు వేస్తే మగజన్మ కాదే
తరుణం మించి పోనీయరాదే మనసా ఇంత మోమాటమా
మామూలుగా ఉండవే.. ఏ సంగతి అడగవే..
అయ్ బాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయ్ బాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం మూగింది ఎదలో
నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో
చరణం2
పసిపాపాయి కేరింత కొంత గడుసమ్మాయి కవ్వింత కొంత
కలిసొచ్చింది కలగన్న వింత కనకే ఇంత ఆశ్చర్యమా
ఊళ్ళో ఉన్న ప్రతి కన్నె కంట ఊరించాలి కన్నీటి మంట
వరమే వచ్చి నా కొంగు వెంట తిరిగిందన్న ఆనందమా
కొక్కొరోకో మేలుకో కైపెందుకో కోలుకో