సినిమాపేరు : అల్లరి || సంగీత దర్శకుడు : పాల్.జె| గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : శ్రీనివాస్
పల్లవి :
నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా
ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా
ఏం చేద్దాం – జత పడదాం
ఈ దూరం – పని పడదాం
ఆనందం కనిపెడదాం – నువు సరేనంటె సరిహద్దే తెంచుకుందాం
చరణం1
లేత పెదవి తడి తగిలి మేను కరిగిపోవాలి
వేడి చూపు సెగ తగిలి ఈడు కందిపోవాలి
ఎమన్నదో నీ ఊపిరి – ఏం విన్నదో నీ తిమ్మిరి
ఎందుకట అరచేతుల్లో ఈ చెమట – కొత్త కదా సరసం కోరే నీ సరదా
మొదలయేదిక్కు ముదిరితే ముప్పు కాదా
చరణం2
కైపు కళ్ళ గమ్మత్తు రేపుతోంది ఓ మత్తు
చీకటల్లె నీ జుట్టు కలలు నింపె నా చుట్టూ
ఆపేదెలా నీ అల్లరి – ఆర్పేదెలా ఈ ఆవిరి
ఒడికొస్తే తికమకలన్ని వదిలిస్తా – చనువిస్తే ఇక నీ వెనుకే పడి ఛస్తా
అడగాలా చెప్పు మొహమాటం తప్పు కాదా
నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా
ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా
ఏం చేద్దాం – జత పడదాం
ఈ దూరం – పని పడదాం
ఆనందం కనిపెడదాం – నువు సరేనంటె సరిహద్దే తెంచుకుందాం