సినిమాపేరు : అంతకు ముందు ఆతర్వాత || సంగీత దర్శకుడు :కళ్యాణి కోడూరి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : శ్రీకృష్ణ ,సునీత
పల్లవి:
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా
ఉన్నానా నేనున్ననా
ఉన్నానుగా అంటున్నానా
వెళ్లొస్తానంటూ.. ఆ నిజం
ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా
చరణం1
గాలిలో మేడ గాల్లోనె ఉంటుంది
నేలకేనాడు దిగిరాదని
నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది
చేతికందేది కాదే అది
చెప్పాలా ఎవరో కొత్తగా
అది నమ్మలేని వింత కాదనీ..
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా
ఆ…. ఆ….. ఆ….
చరణం2
నన్ను నాలాగ చూపించవేమంటు
నిలువుటద్దాన్ని నిందించనా
నేను తన లాగ ఏనాడు మారానో
నాకు నేనింక కనిపించనా
అద్దంలో లోపం లేదనీ
నా చూపులోనే శూన్యముందనీ..
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా