సినిమాపేరు : శైలజా రెడ్డి అల్లుడు || సంగీత దర్శకుడు : గోపి సుందర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : సత్య యామిని
పల్లవి :
తను వెతికిన తగు జత నువ్వేననీ..
కను తెరవని మనసుకు తెలుసా అని..
బదులడిగిన పిలుపది నీదేనని..
తెర మరుగున గల మది విందా అని..
వెలుగేదో కనిపించేలా.. నిన్నే కురిపించేలా..
చుట్టూ కమ్మే రేయో, మాయో మొత్తం కరగాలి..
ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి..
చరణం :
ఉరికే అల్లరి.. ఉడికే ఆవిరి..
ఎవరూ నా సరి లేరను వైఖరి..
పొగరనుకో, తగదనుకో, సహజగుణాలివి..
వలదనుకో, వరమనుకో, వరకట్నాలివి..
ఒడుపుగ వరస కలిపి మహాశయా మగువనేలుకో..
నిను తలవక గడవదు కద కాలం..
నిను కలవక నిలవదు కద ప్రాణమూ..
చరణం :
కన్నె కళ్యాణికి కళ్ళెము వేయవా..
అతిగారానికి అణకువ నేర్పవా..
కసురుకునే కనుబొమలే కలహము ఓడనీ..
బిడియపడే ఓటమిలో గెలుపును చూడని..
చెలియతో చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో..
అదుపెరుగని దివి గంగను నేనటా..
అతిశయమున ఎగసిన మది నాదట..
ఒడుపెరిగిన శివుడవు నీవేనట..
జడముడులతొ నిలుపద నను నీ జత..
పని మాలా బతిమాలాలా? .. ప్రేమా… పలుకవదేలా..
నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా..
పట్టు విడుపూ లేని లేని పంతం ఇంకానా