సినిమాపేరు : నీ స్నేహం || సంగీత దర్శకుడు : పట్నాయక్ ,ప్రభు దేవా | గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : పట్నాయక్
పల్లవి:
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవ నేస్తమా
చరణం1
నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవ నేస్తమా