సినిమాపేరు : వాన || సంగీత దర్శకుడు : కమలాకర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కార్తీక్
పల్లవి
ఆకాశ గంగా దూకావె పెంకితనంగ
జల జల జడిగ తొలి అలజడిగ
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలకు ముడివేస్తున్నా నిన్నాపగా
చరణం 1
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావె
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావె
చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దారి కనుమరుగైనా
నా గుండె లయలో విన్నా నీ అలికిడి
చరణం 2
ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపు తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా
ఆకాశ గంగ నిన్ను ఆపలేనే ఇంక
ముగిసిన కథగా మిగలని స్మృతిగ
కదలవె త్వరగా కడలికి జతగ
ఈ మంచు కొండని విడచి వెళ్ళాలిగా