-1.2 C
New York
Monday, January 19, 2026
spot_img

AHA OKA MANASUKI FULL SONG WITH LYRICS IN TELUGU || ALLARI PRIYUDU SONGS

మాటా పలుకు తెలియనిది
మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయే
కవితలు రాసే మోనమది 
రాగల రోజుల ఊహలకి
స్వాగతమిచ్చే రాగమది
శ్రుతిలయలెరుగని ఊపిరికి
స్వరములు కూర్చే గానమిది
ఋతువుల రంగులు మార్చేది
కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది
నింగిని నేలకు దింపేది
తనే కదా వారధి
క్షణాలకే సారధి మనస్సనేది(అహో)

చూపులకెన్నడు దొరకనిది
రంగు రూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు
స్వప్నాలెన్నో చూపినది
వెచ్చని చెలిమిని పొందినది
వెన్నెల కళ గల నిండుమది
కాటుక చీకటి రాతిరికి
బాటను చూపే నేస్తమది
చేతికి అందని జాబిలిలా
కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా
కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి
అమృతవర్షిని అనిపించే
అమూల్యమైన పెన్నిధి
శుభోదయాల సన్నిధి మనస్సనేది(అహో)

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles